Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు నేటీతో ముగియనున్న గడువు:సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు చేయనున్న సీబీఐ

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐకి నేటీతో గడువు ముగియనుంది.  అయితే ఈ కేసు విచారణకు మరింత సమయం కావాలని  సీబీఐ కోరే అవకాశం ఉంది.

CBI To request Supreme Court For Extend time to YS Vivekananda Reddy Murder Case lns
Author
First Published Jun 30, 2023, 9:33 AM IST

అమరావతి: మాజీ  మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణకు  నేటీతో గడువు ముగియనుంది.   వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు విచారణను  జూన్  30వ  తేదీ లోపుగా  పూర్తి చేయాలని  సీబీఐని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  అయితే  ఈ కేసు విచారణకు  మరింత  సమయం కోరాలని సీబీఐ భావిస్తుందని  సమాచారం.  
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  2019 మార్చి  14వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు.

  ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో   పలువురు నిందితులు, అనుమానితుల  నుండి  స్టేట్ మెంట్లను సీబీఐ సేకరించింది.  మరో వైపు  ఈ కేసులో  పలువురిని  సీబీఐ  అరెస్ట్  చేసింది.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును  తెలంగాణలోని  సీబీఐ  కోర్టు విచారిస్తుంది.  ఈ కేసులో   కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డిని  ఇటీవలనే  నిందితుడిగా  సీబీఐ చేర్చింది. ఈ మేరకు  కోర్టుకు  కూడ తెలిపింది.   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత  ఈ కేసులో  ఐదుదఫాలు  ఆయనను  సీబీఐ అధికారులు విచారించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి  ఇవాళ  కోర్టులో సీబీఐ  అధికారులు  సప్లిమెంటరీ చార్జీషీట్ దాఖలు  చేసే అవకాశం ఉంది. ఈ చార్జీషీట్ లో  సీబీఐ  ఏ అంశాలను  ప్రస్తావిస్తారోననేది సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది. మరో వైపు  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు  గడువును  కోరాలని సీబీఐ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయమై సుప్రీంకోర్టును  రిక్వెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తుంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ గడువు రెండు సార్లు పొడిగించారు.

మరోసారి కూడ  విచారణ గడువు కోరాలని సీబీఐ కోరితే  కోర్టు ఏ రకంగా  స్పందిస్తుందోననేది  ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో హియరింగ్ ఉంది.  దీంతో  నిందితులను  సీబీఐ అధికారులు  కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios