వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  కడపలో అదుపులోకి తీసుకున్న  సీబీఐ అధికారులు  హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. 

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు.శుక్రవారంనాడు ఉదయం కడపలో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి సమక్షంలోనే సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం అరెస్ట్ మెమోను ఉదయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ విషయాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు. 

41 ఏ సీఆర్‌పీసీ ఏ నోటీస్ ఇచ్చి సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కడప నుండి హైద్రాబాద్ కు ఉదయ్ కుమార్ రెడ్డిని తరలించిన తర్వాత సీబీఐ కోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డిని హాజరుపర్చనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుడిగా పేరుంది. వైఎస్ అవినాష్ రెడ్డి ని ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు . ఈ కేసులో తనను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించే కుట్ర చేస్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: సీబీఐ అదుపులో ఉదయ్ కుమార్ రెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి బ్యాండేజీ కట్టింది ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయ ప్రకాష్ రెడ్డి , పులివెందులలో ని ప్రైవేట్ ఆసుపత్రిలో జయప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నాడు.