వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్: విచారణ ఈ నెల 27కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కి బెయిల్ ఇవ్వవద్దని వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తనకు బెయిల్ మంజూరు చేయాలని సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించింది.
మరో వైపు సునీల్ యాదవ్ కి బెయిల్ ఇవ్వవద్దని వైఎస్ వివేకానందరెడ్డి భార్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సాగుతున్న తరుణంలో సునీల్ యాదవ్ కి బెయిల్ ఇవ్వవద్దని వివేకానందరెడ్డి భార్య ఆ పిటిషన్ లో కోరారు. సునీల్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివేకా సతీమణి అభిప్రాయపడ్డారు. దీంో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
ఈ నెల 13వ తేదీన తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణలోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారిస్తుంది.
also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్
గతంలో ఈ కేసును ఏపీ రాష్ట్రంలోని కోర్టు విచారణ నిర్వహించింది. ఏపీ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ నిర్వహించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు కేసు విచారణను బదిలీ చేసింది. దీంతో సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నిందితులను కూడా కడప నుండి హైద్రాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.