వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ వ్యవహారంపై కలియుగదైవం తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి లోకేష్ రెడీగా వున్నారు మీరు రెడీనా అంటూ సోషల్ మీడియా వేదికన సీఎం కు సవాల్ విసిరారు జవహర్. 

గుంటూరు: సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ తో సీఎం జగన్ కుటుంబానికి సంబంధముంది కాబట్టే లోకేష్ సవాల్ విసిరితే ఆయన పరారయ్యారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. కలియుగదైవం తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి లోకేష్ రెడీగా వున్నారు మీరు రెడీనా అంటూ సోషల్ మీడియా వేదికన సీఎం కు సవాల్ విసిరారు జవహర్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''లోకేష్ సవాల్... జగన్ పరార్...ఇక్కడే తేలిపోయింది వివేకా హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో?మీకు,మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేకపోతే వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి ఎందుకు వెనకాడుతున్నారు జగన్ రెడ్డి గారు.హూ కిల్డ్ బాబాయ్?14 న తేలిపోతుంది. లోకేష్ రెడీ...జగన్ రెడ్డి రెడీనా?'' అని జవహర్ సవాల్ విసిరారు. 

read more #whokilledbabai...బాబాయ్ ని చంపింది అబ్బాయే అనడానికి ఆధారమిదే: అయ్యన్న సంచలనం

''వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో నిందితుడు శ్రీనివాస‌రెడ్డి మృతి, వివేకా కుట్లేసిన గంగిరెడ్డి మ‌ర‌ణం అన్నీ అనుమానాల‌కు తావిచ్చేలా వున్నాయి. వివేకా హ‌త్య మిస్ట‌రీ వీడ‌క‌పోతే మరిన్ని మ‌ర‌ణాలు త‌ప్ప‌వా?'' అంటూ జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు.