కడప: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు నుండి ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి కడప పోలీసులకు ఫోన్ చేసినట్టుగా సమాచారం. అనారోగ్యం కారణంగానే తాను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి పోలీసులకు వివరించినట్టుగా సమాచారం.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు నుండే  పరమేశ్వర్ రెడ్డి కన్పించకుండా పోయాడు. అయితే అదే రోజు నుండి పరమేశ్వర్ రెడ్డికి బీపీ డౌన్ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

కడపలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.అయితే కడపలో పరమేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్న సమయంలోనే వివేకానందరెడ్డి హత్య విషయం తెలుసుకొన్న పరమేశ్వర్ రెడ్డి  భార్య ఆయన మృతదేహాన్ని సందర్శించారు.

కడపలోని వైద్యులు సూచన మేరకు పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి కడప పోలీసులకు సమాచారమిచ్చినట్టుగా సమాచారం.

మరోవైపు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు కూడ పరమేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి అనారోగ్యం కారణంగానే తాను తిరుపతిలో చికిత్స పొందుతున్నట్టుగా ఆయన వివరించినట్టుగా చెబుతున్నారు. తానే పోలీసుల వద్దకు రానున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి వివరించినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే  హత్య జరిగిన రోజున ఇద్దరు వ్యక్తులు వివేకా ఇంటికి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు