వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసిన సమయంలో.. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఏ8 అని సీబీఐ పేర్కొంది. గతంలో అవినాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయనను నిందితుడి పేర్కొనలేదు. ఇప్పుడు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దుపై సునీత పిటిషన్.. రేపు సుప్రీంలో విచారణ..!!
వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఈ కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని పేర్కొంది. అవినాష్, భాస్కర్‌రెడ్డిలు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ప్రలోభపెట్టినట్టుగా కూడా పేర్కొంది.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసు: నిన్‌హైడ్రిన్ టెస్టు అంటే ఏమిటి?
వివేకానందరెడ్డి హత్య విషయం ఆయన పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే అవినాష్ రెడ్డికి తెలుసునని సీబీఐ పేర్కొంది. . వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. శివశంకర్‌రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని పేర్కొంది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని తెలిపింది. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని పేర్కొంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని పేర్కొంది.