పులివెందుల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైయస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. రిమాండ్ లో ఉన్న వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.  

ఈనెల 28 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ పులివెందుల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముగ్గురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పోలీసులు పులివెందుల సబ్‌జైలుకు తరలించారు.

ఇకపోతే ఈ ఏడాది మార్చి 15న కడప జిల్లాలోని తన స్వగృహంలో హత్య గావించబడ్డారు వైయస్ వివేకానందరెడ్డి. వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆనాటి ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. 

వైయస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన కుమార్తె సునీత కోరుతున్నారు. ఇటీవలే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అమరావతి క్యాంపు  కార్యాలయంలో సుమారు గంటకు పైగా హత్యపై చర్చించారు.