కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలన్నా భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. కరోనాని పెద్దగా చేసి చూడొద్దని.. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆయన చేసిన కామెంట్స్ పై జగన్ సోదరి డాక్టర్ సునీతా రెడ్డి ఓమీడియా సంస్థతో చర్చించారు. కరోనా లక్షణాలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆమె వివరించారు.

Also Read జగన్ కూతుళ్లను క్వారంటైన్ చేయాలి: చంద్రబాబు కామెంట్స్...

తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విస్తరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 14 రోజుల పాటూ వారు క్వారంటైన్‌లో ఉండాలని.. అలా అబ్జర్వేషన్‌లో ఉన్నవారు నేరుగా కుటుంబ సభ్యుల్ని కలవకపోయినా.. మొబైల్ ద్వారా మాట్లాడొచ్చన్నారు. 

లక్షణాలు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాలని.. అదేవిధంగా డల్ అయిపోకుండా యాక్టివ్‌గా ఉండాలన్నారు. యోగా చేస్తే మంచిదని సూచించారు.. మంచి ఆహారం తీసుకోవాలన్నారు. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.. కరోనా మాత్రమే కాదు.. ప్రతి రోజూ చేతులు కడుక్కుంటే మంచిదని ఆమె సూచించారు.

ఇక కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకోవచ్చా... అనే ప్రశ్నకి కూడా ఆమె స్పందించారు. జ్వరం వస్తే కచ్చితంగా ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పారు. సాధారణంగా కరోనా సోకినవారికి జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయని.. ఆ సమయంలో పారాసిటమాల్ వేసుకోవచ్చని చెప్పారు. జలుబు, దగ్గు ఉంటే.. వాటికి కూడా మందులు వేసుకోవచ్చని చెప్పారు. ఇక వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా అవసరమని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు.