విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు వైయస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైయస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేదికపై చేరుకున్న వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల లు ప్రజలకు అభివాదం చేశారు. జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆశేష జనవాహిని చూసి తన్మయం చెందారు. అందరికీ అభివాదం చేశారు. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వీరి పాత్ర చాలా ఉందనే చెప్పాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైయస్ విజయమ్మ, వైయస్ విజయమ్మ. 

జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ వైయస్ విజయమ్మ పిలుపు ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకింది. ఇకపోతే బై బై బాబూ అంటూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరిని హత్తుకుంది.