దేవుడు జగన్ పక్షాన ఉన్నాడని వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ రోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమె తెలుగు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కోడలు భారతితో కలిసి చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు దేవుడు మంచి భర్త, మంచి కుటుంబాన్ని ప్రసాదించాడని తెలిపారు. తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన చేసేలా శక్తిని దేవుడు ఇచ్చాడని ఆమె అన్నారు. దేవుడి ఆశీర్వాదం కారణంగానే ఆయన కోల్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అభిప్రాయపడ్డారు.

ఇటీవల జగన్ పై హత్యాయత్నం జరగగా.. దేవుడి కృప కారణంగా బయటపడ్డాడని ఆమె అన్నారు. దేవుడు జగన్ పక్షాన ఉన్నాడని...వైఎస్ లాగానే జగన్ తో కూడా ప్రజలు సేవ చేయించుకోవాలని దేవుడు భావిస్తున్నాడని ఆమె చెప్పారు. పాదయాత్రలో జగన్ కి నిత్యం దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడన్నారు. జగన్ లక్ష్యాన్ని దేవుడు త్వరలోనే నెరవేరుస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.