Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టకూడదనే రూల్‌ ఏం లేదు కదా?.. YS Sharmila సంచలన వ్యాఖ్యలు..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ షర్మిల హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ పెట్టకూడదనే రూల్‌ ఏం లేదు కదా అని షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila Sensational comments on Political Party in AP
Author
Hyderabad, First Published Jan 3, 2022, 1:27 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.  వైఎస్ షర్మిల హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ షర్మిల వ్యుహాత్మకంగా సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని షర్మిల వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ రాష్ట్రాంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. ఏపీలో రాజకీయ పెట్టకూడదనే రూల్‌ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. తాము ప్రస్తుతం ఒక ఒక మార్గాన్ని ఎంచుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు.

ఈ నెల 19 లేదా 20 నుంచి తెలంగాణలో పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్టుగా షర్మిల తెలిపారు. నిబంధనల ప్రకారం యాత్ర నిర్వహిస్తామని చెప్పిన అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నిబంధనలు అని ఆమో మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటేనని విమర్శించారు. 

గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విబేధాలు చోటుచేసుకున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.  మరోవైపు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వెళ్లబొతున్నారనే కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వైఎస్సార్‌టీపీలో చేరిన గట్టు రామచంద్రరావు..
మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు వైస్సార్‌టీపీలో చేరారు. సోమవారం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో గట్టు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని అన్నారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios