ఏందిది సామీ : ఎగ్ పఫ్ లకు ఇంతా..! ఎలుకలకు అంతా..!! 

 ఎగ్ పఫ్ లు, ఎలుకల కోసం జగన్ ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని వృధా చేశారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఐదేళ్ళు, ఏడాది, నెల, రోజుకు ఎన్ని ఎగ్ పఫ్ లు తిన్నారు..? ఎంత ఖర్చయ్యింది..? అంటూ లెక్కలతో సహా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. 

 

 

YS Jaganmohan Reddy Faces Social Media Trolls Over Alleged Extravagant Spending on Egg Puffs and Rodent Control AKP

YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రారంభమైన ఈ ట్రోలింగ్ ప్రస్తుత ఎగ్ పఫ్ ల కోసం కోట్లు ఖర్చుచేసారన్న ప్రచారంతో మరింత ఊపందుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా అకౌంట్స్, టిడిపి ఫాలోవర్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు... మొత్తంగా జగన్ ను వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.

గత ఐదేళ్లలో వైఎస్ జగన్, వైసిపి నాయకులు ప్రజాధనాన్ని వృధా చేసారని ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరీముఖ్యంగా సీఎంగా బాధ్యతలు చేపట్టినవెంటనే చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలను బయటపెట్టేపనిలో పడ్డారు. వైసిపి పాలనలో ప్రజాధనాన్ని ఎలా వృధాచేసారో లెక్కలతో సహా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఇంట్లో ఎగ్ పఫ్స్ కోసమే కోట్లు ఖర్చుచేసారన్న ప్రచారం దుమారం రేపుతోంది. 

తాడేపల్లి నివాసంలో ఎగ్ పఫ్స్ ఖర్చు : 

వైసిపి అధికారంలో వున్న ఐదేళ్లు తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసమే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా కొనసాగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇక్కడినుండే రాష్ట్ర పాలనావ్యవహారాలు చూసుకున్నారు. ఆయన కుటుంబం కూడా ఇదే తాడేపల్లి నివాసంలో వుండేవారు. 

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో పాటు సీఎంవో ఉద్యోగులు, సిబ్బంది, ఇంట్లో పనిచేసేవారు, సెక్యూరిటీ... ఇలా అందరూ కలిసి ఐదేళ్లలో 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారన్నది టిడిపి ఆరోపణ. అంటే తాడేపల్లి నివాసం ఎగ్ పఫ్స్ ఖర్చే రూ.3.62 కోట్లట. ఇలా ఎగ్ పఫ్స్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వాడుకున్నారని మండిపడుతున్నారు. 

ఐదేళ్ళలో ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసారంటే ఏడాదికి ఈ ఖర్చు రూ.72 లక్షలు... నెలకు దాదాపు రూ.6 లక్షలు... రోజుకు దాదాపు రూ.20 వేలు. ఈ లెక్కలను బట్టి ఐదేళ్లలో తాడేపల్లి నివాసానికి 18 లక్షల ఎగ్ పఫ్స్ వెళ్లాయి... అంటే రోజుకు 993 ఎగ్ పఫ్స్ తిన్నారన్నమాట. ఇలా కేవలం తాడేపల్లిలో ఎగ్ పఫ్స్ కోసమే జగన్ సర్కార్ ఇంత ఖర్చు చేసారా..! అంటూ సామాన్య ప్రజానీకం ఆశ్చర్యపోతున్నారు.  

వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుండి  పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నారా లేక ఎగ్ పఫ్స్ తినడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఎగ్ పఫ్ తింటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్ పఫ్ సీఎం అంటూ జగన్ ను పేర్కొంటూ టిడిపి అనుకూల సోషల్ మీడియాల్లో పోస్టులు వెలుస్తున్నాయి.  

 

తాడేపల్లి నివాసంలో ఎలుకల ఖర్చు : 

ఎగ్ పఫ్స్ వ్యవహారానికి ముందు తాడేపల్లి నివాసంలో ఎలుకల వ్యవహారంపై టిడిపి ఆరోపణలు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇళ్లు, క్యాంప్ ఆఫీస్ లో ఎలుకలను పట్టుకోడానికే రూ.1.34 కోట్లు ఖర్చు చేసారని టిడిపి ఆరోపిస్తోంది. ఇలా ఎలుకలు పట్టడానికి కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుచేయడం ఏమిటంటూ వైసిపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంచేసింది టిడిపి. 

ఎలుకల కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చుచేసారంటే తాడేపల్లి ప్యాలస్ లో ఎన్నికలు దాచారో..? సొంత డబ్బులు కాపాడుకునేందుకు ప్రజాధనాన్ని జగన్ వృదా చేసారంటూ టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ విషయంలోనే వైఎస్ జగన్ పై తెగ ట్రోల్ జరుగుతున్న సమయంలోనే ఎగ్ పఫ్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఈ ట్రోలింగ్ తారాస్థాయికి చేరుకుంది. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios