Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ మూడో జాబితా విడుదల : విశాఖ ఎంపీ బరిలో బొత్స ఝాన్సీ .. విజయవాడ నుంచి కేశినేని నాని

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్ధుల మూడో జాబితా విడుదలైంది. 21 మందితో కూడిన వైసీపీ అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 

ys jagan ycp released third list for assembly constituency in charges ksp
Author
First Published Jan 11, 2024, 8:57 PM IST

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదలైంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేసిన అనంతరం 23 మందితో కూడిన వైసీపీ అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు 38 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో, రెండో జాబితాలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. 

తొలి జాబితాలో ఎంపీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించలేదు. కానీ సెకండ్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. తాజా లిస్ట్‌లో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు జగన్ మొండి చేయి చూపారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబితాలో 13 మంది కొత్త వారికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. 

సంక్రాంతి తర్వాత మరో రెండు లిస్ట్‌లు విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో వున్నారు. ఈ నెలాఖరులోగా 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేసి వచ్చే నెల రెండో వారంలో ప్రకటించనున్నారు. అదే వారంలో వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. 
 

ఎంపీ అభ్యర్ధులు :

  1. విశాఖ ఎంపీ - బొత్స ఝాన్సీ
  2. శ్రీకాకుళం ఎంపీ - పేరాడ తిలక్
  3. కర్నూలు ఎంపీ - గుమ్మనూరు జయరాం
  4. ఏలూరు ఎంపీ - కారుమూరి సునీల్ యాదవ్
  5. విజయవాడ ఎంపీ - కేశినేని నాని
  6. తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం

ఎమ్మెల్యే అభ్యర్ధులు :

  1. టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
  2. చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
  3. దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  4. ఇచ్చాపురం - పిరియా విజయ
  5. చిత్తూరు - విజయానందరెడ్డి
  6. రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
  7. పూతలపట్టు (ఎస్సీ) - డాక్టర్ మూతిరేవుల సునీల్ కుమార్
  8. మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  9. రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
  10. ఆలూరు - బూసినే విరూపాక్షి
  11. కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
  12. గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
  13. సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
  14. పెనమలూరు - జోగి రమేష్
  15. పెడన - ఉప్పాల రాము
     
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios