అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించిన వైయస్ జగన్ పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా ఈ నెల 20న వైఎస్ జగన్ మొట్టమొదటి సారిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనులను పర్యవేక్షించనున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత సీఎం హోదాలో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 

అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి నిర్మాణం పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.