గోష్పాద క్షేత్రంలో జగన్ పూజలు

ys jagan visits goshpada temple in kovvuru
Highlights

గోదావరి తల్లికి జగన్ హారతి

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా మంగళవారం జగన్.. కొవ్వూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు. 

 ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జననేత గోదావరమ్మకు హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయన పాటు పార్టీ సీనియర్‌ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

loader