అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. గురువారం నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్ తనకేబినెట్ పై వ్యూహరచన చేస్తున్నారు. 

15 మందికి జగన్ తన కేబినెట్ లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే నలుగురికి హామీ ఇచ్చిన వైయస్ జగన్ మిగిలిన వారి కోసం కసరత్తు ప్రారంభించారు. ఆశావాహులు సంఖ్య భారీ స్థాయిలో ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో అన్న అంశంపై చర్చిస్తున్నారు. 

ఇకపోతే జూన్ 8న కేబినెట్ ప్రకటించనున్నారు వైయస్ జగన్. జూన్ 8న తొలిసారిగా ఆయన సెక్రటేరియట్ లో అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న ఉదయం 8.39 గంటలకు జగన్ సెక్రటేరియట్ లో అడుగుపెట్టబోతున్నారు. 

అనంతరం కేబినెట్ ఏర్పాటుపై చర్చించి వెంటనే మంత్రులను ప్రకటిస్తారు. అదేరోజు సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. వెను వెంటనే కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నారని సమాచారం. 

మెుత్తానికి జూన్ 8న జగన్ చాలా బిజీబిజీగా గడపనున్నారని తెలుస్తోంది. సెక్రటేరియట్ లో అడుగుపెట్టడం, కేబినెట్ ప్రకటన, ప్రమాణ స్వీకారం, కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్ ప్రకటనపై వైయస్ జగన్ ఇప్పటికే కీలక నేతలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.