Asianet News TeluguAsianet News Telugu

దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారు, బాబు సిగ్గుపడాలి: జగన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దళితులపై వేధింపులు కొనసాగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు.

YS Jagan terms Chandrababu as anti-Dalit

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దళితులపై వేధింపులు కొనసాగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన బుధవారం దళిత ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు.

విశాఖపట్నంలో దళిత మహిళను టీడీపి నేతలు వివస్త్రను చేసి కొట్టారని జగన్ అన్నారు. అందుకు చంద్రబాబు సిగ్గుపడాలని ఆయన అన్నారు. టీడీపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ పోరాటాలు చేస్తే కేసులు పెట్టారని, జైల్లో మాత్రం పెట్టలేదని అన్నారు. 

దళితులను చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆయన కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. చంద్రబాబుకు దళితులంటే చిన్నచూపు అన్ని అన్నారు. గుంటూరు జిల్లా గొట్టిపాడులో టీడీపీ నేతలు దళితులపై దాడి చేశారని, ఇంకా గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలవుతోందా అని అడుగుతూ కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయడం లేదని అన్నారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నారు కాబట్టే దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే దళితులను కించపరుస్తూ మాట్లాడితే ఎలా అని అడిగారు. 

ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు దళితులు గుర్తు వస్తారని అన్నారు. భూములు లేనివారికి భూములు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారని, ఒక్క ఎకరా కూడా ఇప్పటి వరకు కేటాయించలేదని అన్నారు. అడ్డగోలుగా వసతిగృహాలు మూసి వేయిస్తున్నారని అన్నారు. 

మంచి యన్నది మాల అయితే మాల నేనవుతా అనే గురజాడ మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. నీరు చెట్టు పేరుతో దళితుల భూములను లాక్కుంటున్నారని అన్నారు. అసైన్డ్ భూములు కూడా లాక్కుంటున్నారని అన్నారు.

దళితులు శుభ్రంగా ఉండరని, వారికి చదువు చెప్పడం వృధా అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారని, అటువంటివారు తన మంత్రివర్గంలో ఉంటే బర్తరఫ్ చేసి ఉండేవాడినని చెప్పారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆవులు, గేదెల కొనుగోలుకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని అన్నారు.దళితుల పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు. చెల్లెమ్మ పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్ాచరు. మాలలకు ఓ కార్పోరేషన్, మాదిగలకు మరో కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios