విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తాను ప్రసంగిస్తున్న సమయంలోనే అదే ప్రాంతంలో అంబులెన్స్ కు దారి ఇవ్వాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెప్పి అంబులెన్స్ ను వెళ్లేలా చేశారు.
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తాను ప్రసంగిస్తున్న సమయంలోనే అదే ప్రాంతంలో అంబులెన్స్ కు దారి ఇవ్వాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెప్పి అంబులెన్స్ ను వెళ్లేలా చేశారు.
ఆదివారం నాడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్లలో జగన్ ప్రసంగిస్తున్న సమయంలో అంబులెన్స్ వచ్చింది.ఈ సమయంలో జగన్ అంబులెన్స్ కు దారి ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు.
జగన్ వినతి మేరకు అంబులెన్స్ ఆ దారిలో వెళ్లేలా ఆ పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆరోగ్యశ్రీపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు గాను అంబులెన్స్ లను ప్రభుత్వం ఇలా తిప్పుతోందని జగన్ విమర్శించారు.
అంబులెన్స్ లో పేషేంట్ ఎవరూ లేరని అంటూనే అంబులెన్స్ కు దారి ఇవ్వాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. వైఎస్ఆర్ హాయంలో అంబులెన్స్ 20 నిమిషాల్లో చేరుకొనేదన్నారు. ప్రస్తుతం అంబులెన్స్ షెడ్లలో మూలనపడ్డాయన్నారు.
తాము అధికారంలోకి రాగానే పేదలకు ఎంత ఖర్చైనా సరే ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పిస్తామన్నారు నవరత్నాల్లో పొందుపర్చిన ఆరోగ్య స్కీమ్ గురించి జగన్ మరోసారి ప్రస్తావించారు.
సంబంధిత వార్తలు
