Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులతో బాబుకు అందుకే భయం: జగన్ సంచలనం

ఎవరి మీదనో ఐటీ దాడులు జరిగితే  చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. 

Ysrcp chief Ys jagan sensational comments on chandrababunaidu
Author
Vizianagaram, First Published Oct 7, 2018, 5:31 PM IST


విజయనగరం: ఎవరి మీదనో ఐటీ దాడులు జరిగితే  చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. 
విజయనగరం జిల్లాలో ఆదివారం నాడు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

ఏపీ రాష్ట్రంలో ఎవరిపైనో ఐటీ దాడులు జరిగితే  కేబినెట్ సమావేశం పెట్టి చర్చించడమేమిటని జగన్ ప్రశ్నించారు. గతంలో కూడ ఐటీ దాడులు జరిగాయి కదా అని జగన్ ప్రశ్నించారు.  ఎవరిపైనో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగితే  చంద్రబాబుకు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఐటీ దాడుల వల్ల  తాను దోచుకొన్న  నాలుగు లక్షల కోట్లు బయటపడుతాయనే భయం పట్టుకొందన్నారు.  ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయాలను చేర్చారని చెప్పారు.ఈ డబ్బులతోనే వచ్చే ఎన్నికల్లో  ఓటుకు రూ.3 వేల చొప్పున  కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని  జగన్ ఆరోపించారు.

గతంలో తనపై  కుట్రపూరితంగా సీబీఐ దాడులు జరిగితే.. ఆ దాడుల విషయం కన్పించలేదా అని   జగన్ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను రాష్ట్రంపై  యుద్దంగా చిత్రీకరించేందకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై తనపై కేసులు పెట్టిన సమయంలో సీబీఐ దాడులు చేసినప్పుడు  రాష్ట్రంపై యుద్దం జరిగినట్టు కన్పించలేదా అంటూ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతోంటే  ఓ వర్గం మీడియా బాబుకు కొమ్ముకాస్తోందని  జగన్  విమర్శించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని జగన్  చెప్పారు. ఇసుక, మద్యం, భూములు అన్నింట్లో దోపీడీ జరుగుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

జగన్‌ నాకు శత్రువు కాదు: పవన్ సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios