4 ఏళ్ళైనా ఏపీకి న్యాయం జరగలేదు: జగన్

Ys Jagan slams on bjp, tdp
Highlights

ప్రత్యేక హోదాను అడ్డుకొన్నారు


అమరావతి:రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్ళు దాటినా
రాష్ట్రానికి  న్యాయం జరగలేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్
అభిప్రాయపడ్డారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను
మోసం చేశాయని ఆయన ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా
విడిపోయి నేటికి 4 ఏళ్ళుగా పూర్తైంది. ఈ సందర్భంగా వైఎస్
జగన్ శనివారం నాడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఏపీకి దక్కాల్సిన హోదాను తిరస్కరించారని ఆయన  
ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రానికి ఇచ్చిన ఏ హమీని కూడ నెరవేర్చలేదని జగన్
అభిప్రాయపడ్డారు.


రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయని కేంద్ర, రాష్ట్ర
ప్రజలకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని
ఆయన అభిప్రాయపడ్డారు.

loader