అమరావతి: శాసనమండలిని రద్దు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తేల్చి చెప్పారు. ఈ నెల 27వ తేదీన ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని  సర్కార్ నిర్ణయం తీసుకొన్నట్టుగా  సమాచారం. ఈ నెల 27వ తేదీన శాసనమండలి రద్దు విషయమై కీలక అడుగులు పడనున్నాయి. ఈ విషయమై టీడీపీ ఏ రకంగా వ్యవహరిస్తోందో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also read:టీడీఎల్పీ భేటీ: ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా, బాబుకు షాకిస్తారా?

ఈ నెల 24వ తేదీన ఏపీ అసెంబ్లీలో ఏపీ శాసనమండలి రద్దు విషయమై  చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు  అభిప్రాయపడ్డారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయమై చర్చించారు.

ఈ నెల 27వ తేదీన శాసనమండలి రద్దు  కోసం అసెంబ్లీలో ఏపీ సర్కార్ తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేబినెట్ సమావేశంలో శాసనమండలి రద్దు గురించి తీర్మానాన్ని ఆమోదించనున్నారు.

కేబినెట్ సమావేశం తర్వాత అసెంబ్లీలో ఏపీ శాసనసభలో ఏపీ శాసనమండలి రద్దు విషయమై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. గురువారం నాడే శాసనమండలిని రద్దు చేయాలని జగన్ భావించినప్పటికీ కొందరు వైసీపీ సీనియర్లు ఆచితూచి వ్యవహరించాలని సూచించడంతో సోమవారం నాటికి ఈ విషయమై వేచి చూడాలని జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

శనివారం నాడు పార్టీకి చెందిన కొందరు సన్నిహితులతో జగన్ శాసనమండలి రద్దు విషయమై స్పష్టత ఇచ్చినట్టుగా సమాచారం. శాసనమండలిని రద్దు చేసేందుకు తాను మొగ్గు చూపుతున్నట్టుగా జగన్ సంకేతాలు ఇచ్చారని సమాచారం.

Also Read:మండలి రద్దు దిశగా జగన్: ఛైర్మన్, స్పీకర్‌‌లను పిలిపించిన గవర్నర్

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాదిరిగా తనను చేయకూడదని కొందరు పార్టీ నేతలకు జగన్ స్పష్టం చేసినట్టుగా సమాచారం.  టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఎవరూ కూడ వైసీపీలో చేరేందుకు సిద్దంగా లేరని కొందరు నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చిన సమయంలో జగన్ ఈ రకంగా వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే ఈ నెల 26వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ లతో విడి విడిగా సమావేశమయ్యారు.  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల గురించి చోటు చేసుకొన్న పరిణామాలపై గవర్నర్ ఆరా తీశారు.