ఆంధ్రప్రదేశ్‌లో మతం పేరుతో జరుగుతున్న వరుస పరిణామాపై సీరియస్‌ అయ్యింది జగన్  ప్రభుత్వం. రథాల కాల్చివేత ఘటనలపై పూర్తి విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

తిరుమల బస్సులపై శిలువ బొమ్మలు, టీటీడీ వెబ్‌సైట్, సప్తగిరి మాసపత్రికలో అన్యమత ప్రచారంపై వంటి వాటిని సీబీఐ విచారణ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించింది.

పిఠాపురం నెల్లూరు ఘటనలతో పాటు టీటీడీ ఛైర్మన్‌పై చేసిన దుష్ప్రచారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని యోచిస్తోంది జగన్ సర్కార్. ఒకట్రెండు రోజుల్లో మతపరమైన అన్ని వివాదాల విచారణను సీబీఐకి అప్పగించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

ప్రభుత్వం. సర్కార్‌కు వ్యతిరేకంగా మత పరమైన విషయాల్లో కుట్ర జరుగుతోందని భావనలో ఉన్న ప్రభుత్వం.. ఆయా కుట్రలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని యోచిస్తోంది.