అమరావతి: రాష్ట్ర శానససభ సమావేశాలకు ముందు జరిగిన బీఎసీ సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశాలకు సంబంధించి చర్చ జరుగుతుండగా టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రెండు రోజుల ముందే బిల్లులు పంపాల్సి ఉంటుందని, బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి ఇంత తొందర ఏమి వచ్చిందని టీడీపీ శాసనసభా ఉప నేత అచ్చెన్నాయుడు అన్నాడు. 

అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్పప్పుడు మీరు కూడా అలాగే చేశారని వైసీపీ సభ్యులు అన్నారు. దానిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ .... తాము ప్రకటన చేసిన తర్వాత బి్లలు తెచ్చామని చెప్పారు. బిల్లు తెస్తామని మీ పత్రికలు ముందు నుంచి రాస్తున్నాయి కదా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దాంతో అచ్చెన్నాయుడు ఆ చర్చను అంతటి ఆపేశారు.

Also Read: ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

బిఎసీ సమావేశానికి టీడీపి తరఫున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. స్పీకర్ అధ్యక్షతను జరిగిన ఈ సమావేశం మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమైన స్థితిలో సిఆర్డీఎ రద్దు, అభివృద్ధి, పాలనా వికేంద్రీకరమ బిల్లను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డులన ఏర్పాటు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంతో నాలుగు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Also Read: తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఇదిలావుంటే, అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

సభ సమావేశానికి ముందు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ సభ్యులు చంద్రబాబు నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత అసెంబ్లీకి చంద్రబాబు కాలినడకన చేరుకున్నారు.