ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదు: వైఎస్ఆర్ వాహన మిత్ర నిధులు విడుదల చేసిన జగన్
తమది పేదల ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద నాలుగో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ శిశాఖపట్టణంలో విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని సీఎం జగన్ కోరారు.
విశాఖపట్టణం: తమది పేదల ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం తమది కాదన్నారు సీఎం.చంద్రబాబుకు ఎల్లోమీడియా, దత్తపుత్రుడు అండగా ఉండి పదే పదే అబద్దాలను నిజమనే ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కానీ తనకు నిబద్దత, నిజాయితీ, ప్రజల తోడు, దేవుడు ఆశీర్వాదం ఉందన్నారు.
YSR Vahana Mitra నాలుగో విడత నిధులను ఏపీ సీఎం YS jagan శుక్రవారం నాడు Visakhapatnam లో విడుదల చేశారు.మూడేళ్లలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద రూ.1.026 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2,61,516 మంది లబద్దిదారులకు రూ. 10 వేల చొప్పున ఈ పథకం కింద ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.Auto Drivers గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. పాదయాత్రలో తనను ఆటోడ్రైవర్లు కలిసిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఆటో డ్రైవర్లకు ఆర్ధికంగా అండగా ఉన్నామన్నారు.
గత ప్రభుత్వం అప్పుల చేసి కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్పారు.
కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. తనకు ఓటు వేయకున్నా కూడా అర్హులైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం లేదన్నారు. లంచాలు అసలే లేవన్నారు. బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని సీఎం జగన్ వివరించారు.