తుపాకీ నుండి ఐదు గుండ్లు మాత్రమే బయటకొచ్చాయి: ఎంపీల రాజీనామాపై జ'గన్'

Ys Jagan reacts on Ysrcp MP's resignations
Highlights

బాబుపై జగన్ తీవ్ర విమర్శలు

ఏలూరు: ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు  రాజీనామాలు
చేశారని వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు.తుపాకీ
నుండి ఐదు గుండ్లు మాత్రమే బయటకు వచ్చాయని జగన్ చెప్పారు. తమ ఎంపీల
రాజీనామాలకు టిడిపి భయపడిందన్నారు.


వైపీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో
భాగంగా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలకు ముందుకు
రావడంతో టిడిపి ఒత్తిడికిగురైందన్నారు. తమతో పాటు టిడిపి ఎంపీలు కూడ రాజీనామాలు
చేస్తే ప్రత్యేక హోదాపై జాతీయస్థాయిలో చర్చ జరిగేదన్నారు. దేశమంతా ఏపీ వైపు
చూసేదని ఆయన చెప్పారు. కానీ, రాజీనామాల విషయంలో టిడిపి తమతో కలిసిరాలేదని
ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే  బుద్దున్న వారెవరైనా  ఉప ఎన్నికల్లో పోటీకి నిలుపుతారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి
వ్యతిరేకంగా టిడిపి అభ్యర్ధులను బరిలోకి నిలిపితే ఆ పార్టీ ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తారని ఆయన చెప్పారు. ఉప
ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను నిలిపితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కవని జగన్ ధీమాను
వ్యక్తం చేశారు.

loader