అమరావతి: రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై సీఐడీ కేసు నమోదు చేసింది. అమరావతిలో భూములు కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ చెబుతోంది. ఈ విషయమై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే సీఐడీ విచారణ సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రాజధాని భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అసెంబ్లీలో ఈ వివరాలను బయటపెట్టారు.  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొందరు టీడీపీ నేతల పేర్లను మంత్రి అసెంబ్లీలో పేర్లు చదివి విన్పించారు.

ఎకరానికి రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ గుర్తించింది. తెల్ల రేషన్ కార్డుదారులు ఈ భూములు కొనుగోలు చేసినట్టుగా  సీఐడీ ప్రకటించింది. రూ. 300 కోట్లతో భూమిని కొనుగోలు చేసినట్టుగా సీఐడీ  ఆరోపిస్తోంది. 

తెల్ల రేషన్ కార్డుదారులు కొనుగోలు చేసిన వారి వివరాల గురించి సీఐడీ ఆధారాలను సేకరిస్తుంది. ఈ భూములను కొనుగోలు చేసిన వారి వివరాలను  సీఐడీ  సేకరిస్తోంది. ఈ వ్యవహరంపై విచారణ కోసం నాలుగు బృందాలను సీఐడీ బృందాలను ఏర్పాటు చేసింది.

Also read:శాసనమండలి పరిణామాలపై గవర్నర్‌‌ను కలిసే యోచనలో బాబు

రాజధాని ప్రాంతంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 భూములలను కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు సీఐడీ గుర్తించినట్టుగా చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలోని పెద్దకాకానిలో 40 ఎకరాలను 43 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు కొనుగోలు చేశారు. 

తాడికొండలో 180 ఎకరాలను 188 మంది తెల్లరేషన్‌ కార్డులు కలిగినవారు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు గుర్తించారు.. తుళ్లూరులో 238 మంది తెల్ల రేషన్ కార్డు దారులు 243 ఎకరాలను కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు గుర్తించారు.

మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు, తాడేపల్లిలో 24 ఎకరాలను 49 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ భూములపై  సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.