వైసీపీ చీఫ్, కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం అక్కడి నుంచి నేరుగా కడప చేరుకున్నారు.

పెద్ద దర్గాలో ప్రార్ధనల అనంతరం, పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు.