కీలకమైన రాజధాని గుంటూరు జిల్లాలోకి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసిన జగన్ సోమవారం ఉదయానికి గుంటూరు జిల్లాలో అడుగుపెడుతున్నారు. జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.

జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంతో పాదయాత్ర మొదలవుతోంది. తర్వాత వరుసగా పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, గుంటూరు 1, గుంటూరు 2, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేస్తారు. సుమారుగా 20 రోజులు ప్రజాసంకల్పయాత్రను పూర్తి చేసిన తర్వాత జగన్ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు.