అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశం ముహూర్తం ఖారారైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈనెల 27న వైఎస్ జగన్ గృహ ప్రవేశం చెయ్యనున్నారు. 

ఫిబ్రవరి 27 బుధవారం ఉదయం 10 గంటలకు అటు నూతన ఇంటిలో అడుగుపెట్టబోతున్నారు. అదే ముహూర్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు జగన్. 

ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు అందరూ పాల్గొనాలని ఇప్పటికే ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. 

జగన్ నూతన గృహ ప్రవేశం, నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తాడేపల్లిలోనే ఉండనున్నారు. ఇకపై నూతన కేంద్ర కార్యాలయం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు జరపనున్నారు జగన్. నూతన గృహప్రవేశం అనంతరం ఈనెల 28న తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావంలో వైఎస్ జగన్ పాల్గొంటారు.