Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై ప్రివిలేజ్ మోషన్: ఏపీ అసెంబ్లీలో జగన్

 ఏపీ అసెంబ్లీలో  సంక్షేమ పథకాలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య పరస్పర విమర్శల నేపథ్యంలో గందరగోళ వాతావరణం నెలకొంది.టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ys Jagan moves  privilage motion against tdp mla nimmala ramanaidu lns
Author
Amaravathi, First Published Dec 3, 2020, 12:15 PM IST

అమరావతి: ఏపీ అసెంబ్లీలో  సంక్షేమ పథకాలపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య పరస్పర విమర్శల నేపథ్యంలో గందరగోళ వాతావరణం నెలకొంది.టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read:పారిపోయే చరిత్ర,ఫేక్ ప్రతిపక్ష నేత: బాబుపై కొడాలి నాని తీవ్ర విమర్శలు

గురువారం నాడు సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  సభలో అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. 

రామానాయుడు సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడు డ్రామానాయుడుగా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని జగన్ స్పీకర్ ను కోరారు. రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడుతున్నట్టుగా జగన్ చెప్పారు. 

సీఎం ప్రతిపాదించిన ప్రివిలేజ్ మోషన్ ను కమిటీకి రిఫర్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఆ తర్వాత సీఎం ప్రసంగించారు. తన పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి సీఎం ఈ సందర్భంగా వివరించారు.

రెండు పేజీల మేనిఫెస్టోను మాత్రమే ప్రజల ముందు ఉంచినట్టుగా ఆయన చెప్పారు.  2018 సెప్టెంబర్ 3వ తేదీన పాదయాత్రలో తాను  ఇచ్చిన హామీ వీడియోను అసెంబ్లీలో ఆయన  ప్రదర్శించారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios