ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా కూతురు వివాహ వేడుకల్లో సీఎం పాల్గొంటారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ఆదివారం నాడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ Amzath Basha కుమార్తె Marriageవేడుకలో పాల్గొని నూతన వధూవరులను సీఎం ఆశీర్వదిస్తారు. అలాగే RIMS వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారని అధికారులు చెప్పారు. సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు సీఎం టూర్ ఏర్పాట్లను శనివారం నాడు పరిశీలించారు.
Kadapa విమానాశ్రయం, రిమ్స్‌లోని GGH ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆస్పత్రికి చేరుకుని అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాష కుమార్తె వివాహం జరిగే జయరాజ్ గార్డెన్స్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చూశారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో Police అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బు రాజన్ కోరారు. శనివారం జయరాజ్ గార్డెన్స్‌లో పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి పర్యటన ముగించుకుని వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ అధికారులకు పలు సూ చనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు వెంకట కుమార్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కడప విమానాశ్రయం తదితర ప్రదేశాల్లో జిల్లా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజర్ బాషా కూతురు వివాహం సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, విఐపీలు, వీవీఐపీలు కూడా కడపకు చేరుకొంటారు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.
నేడు విశాఖ జిల్లాలో రాష్ట్రపతి, సీఎం జగన్ టూర్
Visakhapatnam జిల్లాలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గాను సీఎం జగన్ విశాఖకు సాయంత్రం వెళ్లనున్నారు. కడప నండి విశాఖ జిల్లాకు సీఎం జగన్ బయలుదేరి వెళ్లనున్నారు.ఐఎన్ఎస్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి Ramnath Kovind విశాఖపట్టణం వస్తున్నారు. అయితే రాష్ట్రపతి టూర్ లో పాల్గొనేందుకు గాను సీఎం జగన్ వశాఖకు రానున్నారు. రాష్ట్రపతి కోవింద్ టూర్ ను పురస్కరించకుొని అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
