ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు ఆశీర్వదించారు.

శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో వేద పండితులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం వైసీపీ అధినేతను ఆశీర్వదించి, శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.