Asianet News TeluguAsianet News Telugu

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ మళ్లీ వాయిదా

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు

YS Jagan Mohan Reddy illegal assets case: Hyderabad court adjourns hearing of case to 27th october
Author
hyderabad, First Published Oct 21, 2020, 3:16 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణ.. 20వ తేదీకి వాయిదా పడింది. కాగా.. మంగళవారం విచారణకు రావాల్సిన ఈ కేసును మళ్లీ 27వ తేదీకి వాయిదా వేశారు.

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. ఇదిలావుంటే, మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి(ఎంఎ్‌సజే కోర్టు) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. 

కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎ్‌సజే కోర్టు విచారణలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios