Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మంత్రి షెకావత్ తో సీఎం జగన్ భేటీ

సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు. కాగా.. 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

YS Jagan Meeting With Central Minister gajendra singh shekhawat
Author
Hyderabad, First Published Sep 23, 2020, 10:49 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. రెండో రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ని కోరారు. 

కాగా.. సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు. కాగా.. 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో  ఆయన నివాసంలో జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్లు సమాచారం. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్టరూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios