అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు: విజయనగరంలో జగన్

వివక్ష లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
 

YS Jagan inaugurates distribution of house site pattas in Vizianagaram district lns

విజయనగరం:వివక్ష లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

విజయనగరం జిల్లాలోని గుంకలాలంలో పేదలకు బుధవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

వంద కోట్లతో 397 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 12 వేల మంది 300 మంది లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. 

ఎన్నికల హామీల్లో 95 శాతం పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు స్థిరాస్థిని అందిస్తున్నట్టుగా చెప్పారు.ఇల్లు లేని నిరుపేద పేదల్లో 30 లక్షల 75 వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. 

రెండు దశల్లో ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. 18 నెలల్లో తమ ప్రభుత్వం అనేక హామీలను అమలు చేసిందని ఆయన తెలిపారు.  వివక్షకు తావు లేకుండా లబ్దిదారులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

కొందరు స్వార్థపరులు కుట్రలు పన్నడంతో ఇళ్ల పట్టాల పంపిణీ జరగకుండా  ఉండేందుకు కోర్టులను ఆశ్రయించారని ఆయన చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 

న్యాయపరమైన  చిక్కులు తొలగిన తర్వాత అందరికీ రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1.80 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇళ్ల స్థలాలను సేకరించినట్టుగా చెప్పారు.

ల్యాండ్ పూలింగ్ కు సంబంధం లేని వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే ఇచ్చిందన్నారు. చంద్రబాబు ప్రమేయంతోనే ఆయన కోర్టును ఆశ్రయించారని సీఎం జగన్ ఆరోపించారు.  రాజమండ్రిలో కూడ ఆవ భూములు కాకుండా కోర్టును ఆశ్రయించారని ఆయన చెప్పారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios