జగన్‌కు అస్వస్థత.. పాదయాత్ర మధ్యలోనే వచ్చేసిన వైసీపీ చీఫ్

Ys jagan Illnesses
Highlights

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు... 228వ రోజు పాదయాత్రలో భాగంగా  ఇవాళ ఉదయం చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.

యాత్రలో ఉండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, జలుబుతో వైసీపీ అధినేత బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జగన్‌ అస్వస్థతకు గురికావడంతో ఇవాళ పాదయాత్ర కొనసాగేది లేనిది అన్న దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేయనుంది.
 

loader