సీబీఐ చేతుల్లోకి డాక్టర్ సుధాకర్ కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కార్

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్ట్ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. న్యాయ నిపుణలతో చర్చల అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

YS Jagan govt ready to move supreme court on ap high court orders cbi enquiry on doctor sudhakar

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్ట్ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. న్యాయ నిపుణలతో చర్చల అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రభుత్వం పై నమ్మకం లేదంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసామని ప్రభుత్వం వాదిస్తోంది. మొన్నటి వివాదంలో కూడా సుధాకర్ ముఖ్యమంత్రి ని వ్యక్తిగతంగా, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేసినా ఆ వాదనలను హై కోర్టు పట్టించుకోలేదని ఏపీ సర్కార్ భావన. కేవలం మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి ఎలా ఇస్తారని అభ్యంతరం తెలిపింది. 

Also Read:వాళ్లే చొక్కా చించి, అర్ధనగ్నం చేశారు, చేతులు కట్టేసి పడేశారు: డా. సుధాకర్

కాగా డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణ చేయాలని ఏపీ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిది వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణం రోడ్లపై అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. మద్యం మత్తులో ఆయన రోడ్డుపై  రభస సృష్టించాడని పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటనపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు లేఖ రాశారు.ఈ లేఖను పిటిషన్ గా హైకోర్టు స్వీకరించింది. డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేశారని ఆ లేఖలో అనిత చెప్పారు.

ఈ విషయమై విచారణ చేసిన హైకోర్టు విశాఖ జిల్లా సెషన్స్ జడ్జిని డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకోవాలని ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ నుండి విశాఖ జిల్లా సెషన్స్ జడ్జి హైకోర్టుకు నివేదికను సమర్పించాడు..డాక్టర్ సుధాకర్  ఘటనపై శుక్రవారం నాడు విచారణ చేసిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Also Read:డా సుధాకర్ పై దాడి: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్, సీబీఐ విచారణకు ఆదేశం

డాక్టర్ సుధాకర్ పై దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సీబీఐని సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది. ప్రభుత్వం ఇచ్చే నివేదికపై నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కనీసం మాస్కులు కూడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని డాక్టర్ సుధాకర్  ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సంబంధించిన వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios