Asianet News TeluguAsianet News Telugu

అగ్రవర్ణాల్లో పేదలకు గుడ్‌న్యూస్.. ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు ఏపీ సర్కార్ రెడీ..?

అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బీసీ రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రంలోని కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు లబ్ధి కలగనుంది. 

ys jagan govt ready to implement ebc reservations in andhra pradesh ksp
Author
Amaravathi, First Published Jul 14, 2021, 10:18 PM IST

అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఈ రాత్రికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం వుంది. దీంతో అగ్రవర్ణాల్లో పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ అమలుకానుంది. 2019లో ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది కేంద్రం. ఈ బీసీ రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రంలోని కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు లబ్ధి కలగనుంది. 

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 జనవరిలో ఆమోద ముద్ర వేశారు. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ‘‘సబ్‌కా సాథ్...సబ్‌కా వికాస్’’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు బీజేపీ చెప్పుకొచ్చింది. మంచి ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామని బీజేపీ స్పష్టం చేసింది. 

Also Read:తెలంగాణలో ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు: ఉత్తర్వులు జారీ

అగ్రకులాల్లోనూ పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారని ఆఖరికి చదువుకోవాలన్నా, వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారంటూ బీజేపీ బిల్లును సమర్థించుకుంది. పేద-గొప్ప అనే తారతమ్యం లేకుండా, సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ రిజర్వేషన్లకు రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios