అమరావతిలో అసంపూర్తిగా వున్న భవనాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దీనిలో భాగంగా భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు సమీకరించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి ఎంఆర్‌డీఏకు మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చింది. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు గతంలో సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల కమిటీ రూ.2,154 కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది.

Also Read:ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ భూములు వెనక్కి, తిరిగి రైతులకే

కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు మరో రూ.300 కోట్లు అవసరమని భావించింది. 70 శాతానికి పైగా నిర్మాణం పూర్తయిన భవనాలను సిద్ధం చేయాలని కమిటీ సూచించింది.

దీంతో బ్యాంక్ గ్యారెంటీకి ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు హ్యాపినెస్ట్ ప్రోగ్రామ్, కరకట్ట నిర్మాణం కోసం అవసరమైన నిధుల్ని సేకరించాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు.