Asianet News TeluguAsianet News Telugu

మహిళా ఖైదీలకు ఊరట: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలోని మహిళా ఖైదీల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించిన మహిళా జీవీత ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

YS Jagan Govt decides to release woman prisoners completed 5 years imprisonment
Author
Amaravathi, First Published Nov 6, 2020, 8:23 AM IST

అమరావతి: మహిళా ఖైదీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది స్వాతంత్ర్వ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉపశమనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. 

అందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

అందుకు సంబంధించిన కసరత్తుకు ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోంశాఖ), సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్శి (లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, న్యాయశాఖ) డీజీపీ లేదా డీజీపీ నామినేట్ చేసే పోలీసు అధికారి, ఏపీ సీఐడీ లీగల్ అడ్వయిజర్, జిల్లా న్యాయమూర్తి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఉంటారు.

సంబంధిత సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే వారి జాబితాను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుంది. మహిళా ఖైదీల్లో ఐదేళ్లు పూర్తి చేసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios