ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లికానుకలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లికానుకలు ఇవ్వాలని నిర్ణయించింది. సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో కూడా జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనున్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. లక్ష మేర పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు.. ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే 1.20 వేలు ఇవ్వనున్నారు. అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. ఇక మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష నజరానా ఇవ్వనున్నారు. అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50లు ఇవ్వనున్నారు. కొత్త పథకాలతో మొత్తం 94.4 శాతం హామీలు నెరవేర్చామని చెబుతోంది జగన్ సర్కార్.
