ఏపీ బీసీ కార్పోరేషన్లకు రేపు నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. తొలిసారిగా భారీ మొత్తంలో బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల ఆర్ధిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మొత్తం 56 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు.

అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగ వంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకు కూడా కార్పోరేషన్లు ఏర్పాటయ్యాయి. 30 వేలకు పైగా జనాభా వున్న బీసీ కులాలు అన్నింటికి కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పురుషుల కన్నా మహిళలకు ఎక్కువగా ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్ పోస్టులు ఇస్తున్నారు. డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తున్నారు.