Asianet News TeluguAsianet News Telugu

ఏడాదిలో ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారం: జగన్ పాలనపై బాబు విమర్శలు

రాష్ట్రంలో హవాలా భాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. 

Ys jagan government Rs. 50,000 crore burden: chandrababu
Author
Amaravathi, First Published Jul 21, 2020, 3:59 PM IST


అమరావతి:రాష్ట్రంలో హవాలా భాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. 

ప్రకాశం జిల్లా నుండి తరలించిన రూ. 5. 25 కోట్లు తమిళనాడులో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై తమిళ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేసిన వార్తలను ఆయన ఉటంకించారు. 

కరోనా సమయంలో అంత నగదు ఎక్కడిది..? ఇంత నగదు ట్రాన్సాక్షన్ చేసే వ్యాపారం బంగారం వ్యాపారికి ఉందా..? బంగారం కొనడానికి నగదు తీసుకెళ్తారా, చెక్కులు, డీడిలు తీసుకెళ్తారా..?  చెన్నైలో ఎవరి దగ్గర బంగారం కొన్నారు..? ఎవరికి ఇవ్వడానికి ఈ నగదు తీసుకెళ్తున్నారు..? వాళ్లకు బాలినేనికి ఉన్న బంధుత్వం ఏమిటి..? 
పట్టుబడ్డ ముగ్గురు దుకాణం ఉద్యోగులా, మంత్రి బాలినేని అనుచరులా..? పారిపోయిన ఇద్దరు ఎవరు, వారిలో బాలినేని కొడుకు ఉన్నాడనే వార్తల్లో నిజమెంత..? బంగారం వ్యాపారంలో బాలినేని భాగస్తుడా..? వీటన్నింటికీ జవాబివ్వాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. 14నెలలుగా ఏపిలో హవాలా లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెల్లడించాలని ఆయన కోరారు. 

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిపి సీనియర్ నాయకుల సమావేశం మంగళవారం ఆన్ లైన్ లో జరిపారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,‘‘ మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ అకాల మరణం పట్ల సంతాపం తెలిపారు. కురుపాం నియోజకవర్గ ప్రజలకు, విజయనగరం జిల్లా టిడిపికి చేసిన సేవలను ప్రశంసించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం పరితపించారు. జనార్ధన్ థాట్రాజ్ మృతి టిడిపికి తీరనిలోటన్నారు.

 రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.. మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా ఉంది, రికవరీ రేటులో అట్టడుగున ఉన్నామన్నారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. విశాఖలో మెడ్ టెక్ పెట్టాం. అమరావతిలో,విశాఖలో అత్యున్నత వైద్యశాలల ఏర్పాటుకు కృషి చేశాం. వైసిపి వచ్చాక వాటిని రద్దు చేశారు, నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు.

కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు, చేర్చుకున్నవారికి సరైన ఆహారం లేదు, ఆక్సిజన్ సరఫరా లేదు, అంబులెన్స్ ల నిర్వహణ అధ్వానం, ఒక్కో అంబులెన్స్ లో డజన్ల సంఖ్యలో రోగులను కుక్కుతున్నారని ఆయన విమర్శించారు.

క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఏమిటి..? ఇప్పుడు అందజేస్తున్న ఆహారం ఏమిటి..? అన్నా కేంటిన్లలో రూ 5కే టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఆహారం ఎలా ఉంది..?  క్వారంటైన్ కేంద్రాల్లో వైసిపి ప్రభుత్వం ఇచ్చే రూ500 ఆహారం ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. డిశ్చార్జ్ అయిన రోగులకు రూ2వేలు ఇస్తామని చెప్పి రూ50, రూ100 చేతిలో పెట్టి పంపిస్తారా..? ఆయన ప్రశ్నించారు.

also read:పదే పదే అవే పొరపాట్లు: బాబుపై తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదు ఇదే....

తప్పుడు సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. రూ5కోట్ల 27లక్షల నగదు హవాలాలో మంత్రి బాలినేనిని ఎందుకు  అరెస్ట్ చేయడం లేదో చెప్పాలన్నారు. షెల్ కంపెనీలతో హవాలా లావాదేవీలు చేస్తున్న వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయరు.? న్యాయమూర్తిపై దాడి సూత్రధారి పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన అడిగారు.

బాలినేని హవాలాకు సంబంధించి పై పోస్ట్ పెట్టిన యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్ లో కొడతారు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు తొలగించారని నిలదీసిన నెల్లూరు వృద్దురాలిపై కేసు పెట్టిన విషయాలను ఆయన గుర్తు చేశారు.

దళిత న్యాయమూర్తి రామకృష్ణను ‘‘వాడు వీడు’’ అని నోరు పారేసుకున్న మంత్రిపై చర్యలు తీసుకోరు. న్యాయమూర్తిపై దాడిచేసి దారుణంగా కొట్టిన వాళ్లను ఏం చేశారు..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దళితులపై  అత్యాచారాలు, అరాచకాలు జరుగుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు నోరు విప్పలేదు. బాబాయి హత్య కేసులో నోరు విప్పడు, బాలినేని హవాలాపై నోరు విప్పడు, పెద్దిరెడ్డి దౌర్జన్యాలపై నోరు విప్పడు...క్వారంటైన్ కేంద్రాల్లో నాసిరకం ఆహారంపై నోరు విప్పడం లేదన్నారు.


కరోనా కష్టాల్లో ప్రజలుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. ఏడాదిలో 3సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. కరెంటు బిల్లులు 4రెట్లు అధికం చేశారు. ఆర్టీసి ఛార్జీలు పెంచి రూ2వేల కోట్ల భారం వేశారు. ఇసుక, సిమెంటు ధరలు పెంచేశారు. రూ 16వేల కోట్ల లోటులోనూ టిడిపి హయాంలో ప్రజలపై భారాలు మోపలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

 ఏడాదిలోనే పేదలపై రూ50వేల కోట్ల భారాలు మోపారు. 34స్కీములు రద్దు చేశారు. రూ లక్ష కోట్లు అప్పులు చేశారు. రాబోయే 4ఏళ్లలో ఎన్ని అప్పులు చేస్తారో ఆందోళన కలుగుతోంన్నారు. ఇప్పటికే జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 34.6%కి పెరిగింది. ఒక్క ఏడాదిలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భవిష్యత్ తల్చుకుంటేనే భయం వేస్తోందని బాబు చెప్పారు.

. రాష్ట్రానికి వైసిపి చేస్తున్న నష్టాలపై ప్రజలను చైతన్య పరచాలి. కష్టాల్లో ఉన్న పేదలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను టిడిపి నాయకులు ఆదుకోవాలి, వారికి అన్నివిధాలా అండగా ఉండాలి. వారిలో మనోధైర్యం కల్పించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios