వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: కోర్టులో ఫిర్యాదుకు జగన్ సర్కార్ నిర్ణయం

వాలంటీర్లపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై  కోర్టులో ఫిర్యాదు చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రభుత్వం ఆదేశించింది. 
 

YS Jagan Government Decides  To  File Case Against  Pawan Kalyan  lns


అమరావతి: వాలంటీర్లపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  కోర్టులో ఫిర్యాదు  చేయాలని  ప్రభుత్వం   నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  చర్యలు తీసుకోవాలని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను  ప్రభుత్వం ఆదేశించింది.  మహిళల అక్రమ రవాణాలో  వాలంటీర్లు  కారణమౌతున్నారని  పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన వ్యాఖ్యలు చేశారు.  వారాహి యాత్రను ఏలూరు నుండి ప్రారంభించారు. ఈ యాత్రలో  పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి వ్యాఖ్యలు  చేశారు.  తనకు కేంద్ర నిఘా సంస్థల నుండి ఈ సమాచారం ఉందని  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  వాలంటీర్లు  తీవ్రంగా మండిపడ్డారు.  రాష్ట్రంలో పలు చోట్ల  ఆందోళనలు నిర్వహించారు. ఈ వ్యాఖ్యలపై  పలు పోలీస్ స్టేషన్లలో కూడ  వాలంటీర్లు  పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు.

వాలంటీర్లపై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను  ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.  పలువురు మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడ ఈ విషయమై తీవ్రంగా స్పందించారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో వాలంటీర్లు  కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాలంటీర్లపై   పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు  చేయడాన్ని  ప్రభుత్వం తప్పుబడుతుంది.   ఈ వ్యాఖ్యలు  చేసిన పవన్ కళ్యాణ్ పై  సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను  ఆదేశించింది  ప్రభుత్వం.

వాలంటీర్లపై జనవాణి కార్యక్రమంలో తమకు  ఫిర్యాదులు అందాయని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. తన ఉద్దేశ్యం  వాలంటీర్ల పొట్ట కొట్టడం కాదని వివరణ ఇచ్చారు. తనకు  వాలంటీర్లంటే  కోపం లేదని కూడ పేర్కొన్నారు.  

also read:ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చేసిన పవన్ కళ్యాణ్.. మంగళగిరిలోని కార్యాలయానికి జనసేనాని

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  వాలంటీర్ల  వ్యవస్థను పలు రాష్ట్రాలు అభినందించిన విషయాన్ని వైఎస్ఆర్‌సీపీ   నేతలు  గుర్తు  చేస్తున్నారు.  ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థను కించపరుస్తారా అని  వైసీపీ ప్రశ్నించింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios