జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిరర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెంటే ఉన్నారు. 

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడ కొందరు అభిమానులు ఆయన చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం, వారు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ పార్టీలోకి చేరబోతున్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. 

ఎన్డీయే పక్షాల సమావేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. దీంతో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీయే భేటీలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మురళీధర్, అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. అమిత్ షాతో సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ రోజు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గంటకు పైనే భేటీ అయ్యారు.

Also Read: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ.. ఏపీలో పరిస్థితులపై చర్చ..!

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అరగంటకుపైగా సాగిన సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అమిత్ షాతో పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ‘‘ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!’’ అని అమిత్ షాతో భేటీపై పవన్ ట్వీట్ చేశారు.