రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మాజీ సలహాదారు పీవీ రమేష్ చేసిన ఓ ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. దీంతో సాయంత్రం ఆయన అప్రమత్తమైన ఆయన మరో ట్వీట్ పెట్టారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయఎస్ జగన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్వీట్ కలకలం సృష్టించింది. ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించారనే చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారని కొంత మంది భావించారు. నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే... ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే అని ప్రముఖ కవి వరవరరావు మాటలను ఉంటకిస్తూ ఆయన ట్వీట్ చేశారు 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆయన ట్వీట్ రాజకీయ దుమారాన్ని రేపింది. పదవీ విరమణ తర్వాత కూడా రమేష్ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలంచారు. నిరుడు చివరలో ఆయన రాజీనామా చేశారు. తాను పర్యవేక్షిస్తు్న శాఖలను తొలగించడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థలో చేరారు కొంత కాలంగా మౌనం పాటిస్తూ వచ్చారు. అకస్మాత్తుగా ఆ ట్వీట్ తో ఆదివారం ఉదయం దుమారం రేపారు. 

స్వీయానుభవంతో రమేష్ అలా రాశారని చాలా మంది అన్వయించుకున్నారు. తీవ్ర దుమారం రేపడంతో పీవీ రమేష్ సాయంత్రం మరో ట్వీట్ చేశారు. తాను ట్వీట్ చేసిన వరవరరావు ఉటంకిపులు ఏ ప్రభుత్వాన్నీ, వ్యక్తులనూ ఉద్దేశించి చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు అది ఓ కవితలో భాగమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు 

విశ్వజనీనమైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తే మీ ఆలోచనా శక్తి అంత వరకే పరిమితమైందిగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు.