కాకినాడ కాదు, ఇక్కడి నాయకులు స్మార్ట్ గా తయారయ్యారు : జగన్

YS Jagan fires on AP CM Chandrababu Naidu
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా మారిందో లేదో కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం స్మార్ట్ గా తయారయ్యారని వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగున్నర సంవత్సరాల టిడిపి పాలనలో కాకినాడ నగరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ ఆరోపించారు. కానీ మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండగానే ఇప్పుడు కాకినాడ అభివృద్ది గుర్తొచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. 

జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షో లో జగన్ అధికార పార్టీపై, సీఎం చంద్రబాబుపై కాస్త ఘాటుగా విమర్శలు చేశారు. ఇన్నాళ్లు కాకినాడ అభివృద్దిని గాలికొదిలేసి ఇప్పుడు పబ్లిసటీ కోసం అభివృద్ది పనులకు టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు నగరంలో అద్వాన్నంగా మారిన రోడ్లు, డ్రైనేజి, డంపింగ్ యార్డులను కూడా ఈ టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

ఇక 2016-17, 2017-18 సంవత్సరాలకు స్మార్ట్ సిటీల అభివృద్దిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందన్న జగన్ అందులో కేవలం రూ.40  కోట్లను మాత్రమై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిందని అన్నారు. ఇక  సర్పవరం, జగన్నాథపురం రోడ్డు విస్తరణను ఏడునెలల్లో పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఇక డంపింగ్ యార్డుల గురించి పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో కాకినాడ సిటీలో చాలా అభివృద్ది చెందిదని జగన్ గుర్తు చేశారు. ఆయన హయాంలోనే నగరంలో రెండు బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని అన్నారు. అయితే ఆయన హయాంలో ప్రారంభించిన జగన్నాథ పురం కాలువపై బ్రిడ్జి అంచనా వ్యయాన్ని ఈ ప్రభుత్వం రూ.54 కోట్ల నుండి రూ.140 కోట్లకు మార్పిందంటూ మండిపడ్డారు. ఇలా కాకినాడలో అవినీతి పాలన సాగుతోందని, అందువల్ల స్మార్ట్ సిటీల జాబితాలో కాకినాడ చిట్టచివరి 20వ స్థానంలో నిలిచిందని జగన్ తెలిపారు.
 
loader