శ్రీకాకుళం : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

సాటి మనుషుల పట్ల ప్రేమను, శాంతియుత సహజీవనం, సహనం, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండటమే నిజమైన క్రీస్తు తత్వమని అభిప్రాయపడ్డారు. మానవాళికి క్రీస్తు తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలని ఆయన గుర్తు చేశారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.  

శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు ప్రజలకు వైఎస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు