కరోనా మహమ్మారి మన దేశంలో విరుగుడు కనుగొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ వ్యాక్సిన్ వికటించి కూడా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లా కి చెందిన ఓ వాలంటీర్ కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు.