రైతులకు అండగా నిలిచాం: వైఎస్ఆర్ యంత్రసేవా పథకం ప్రారంభించిన జగన్
వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు ప్రారంభించారు.
గుంటూరు:రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ఆర్ యంత్రసేవా పథకాన్ని శుక్రవారంనాడు గుంటూరులో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు కొత్తగా రూ.361.29 కోట్ల విలువైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి ఆర్బీ కే సెంటర్ లో యంత్రాలకు రూ. 15 లక్షలు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. రైతలకు అవసరమైన యంత్ర పరికరాలను వారికి అందిస్తున్నామన్నారు.
రైతులకు వైఎస్ఆర్ యంత్రసేవ యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ లో 7 లక్షల మందికి లబ్ది కలిగేలా యత్రాలు అందిస్తామన్నారు. రైతలందరికి మంచి జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.